దారుణం : ఆరేళ్ల చిన్నారిని భవనం పైనుంచి కిందకు పడేశాడు..

విజయవాడలోని వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్నకూతురినే చిన్నాన్న భవనం మూడో అంతస్తు నుంచి కిందకు పడేశాడు. మద్యం మత్తులో రాక్షసత్వం ప్రదర్శించాడు. కృష్ణ, యేసు అన్నదమ్ములు.. వారి మద్య చిన్న వివాదం తలెత్తింది. ఇది ఘర్షణకు దారి తీసింది. సరిగ్గా అదేసమయంలో అక్కడున్న యేసు కుమార్తె చిన్నారి జానికిని బాబాయ్ కృష్ణ ఎత్తి భవనంపై నుంచి కిందకు పడేశాడు. ఆరేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags

Next Story