స్వామీ నిత్యానంద.. నీ లీలలు చాలయ్యా.. మా బిడ్డలను వదులయ్యా..

స్వామీ నిత్యానంద.. నీ లీలలు చాలయ్యా.. మా బిడ్డలను వదులయ్యా..
X

nityananda

రాసలీలల రసికుడిగా నిత్యానందుని లీలలు వర్ణించనలవి కాదు. ఆయన చెరలో చిక్కుకున్న అభాగ్యులు బయటకు వచ్చి స్వామి వారి బాగోతాన్ని బయటపెట్టే వరకు ఆయనొక దైవాంశ సంభూతుడు. తాజాగా నిత్యానంద ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిల కేసు కలకలం సృష్టిస్తోంది. జనార్ధన శర్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వారిని 2013లో బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పుడప్పుడు పిల్లలను చూసి వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆశ్రమ వాసులు ఆ నలుగురిని నిత్యానంద ధ్యానపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు.

దీంతో శర్మ దంపతులను కూతుళ్లను కలవడానికి అక్కడికి వెళ్లారు. అయితే వారిని అధికారులు పిల్లలను చూడడానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన శర్మ దంపతులు వారి సహాయంతో మైనర్లైన ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. కానీ మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు ముద్ర శర్మ (21), నందిత (18) తల్లిదండ్రులతో రామని చెప్పారు. దీంతో తండ్రి శర్మ ఆశ్రమ నిర్వాహకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి లోబరుచుకుని ఉంటారని అందుకే తమతో రామని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డలను అప్పగించమని కోరుతున్నారు.

Next Story