పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు.. జీతం: రూ.69,100

పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు.. జీతం: రూ.69,100
X

drdo

ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో ఇప్పుడు సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 400 సెయిలర్ పోస్టుల భర్తీని చేపట్టింది ఇండియన్ నేవీ. మెట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2020 బ్యాచ్‌లో షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఆసక్తిగల అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పదవతరగతి పాసైన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరితేదీ. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఐఎన్ఎస్ చిల్కాలో 2020 నుంచి 15 వారాల పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు : షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్.. విద్యార్హత: మెట్రిక్యులేషన్.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 నవంబర్ 23.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 28.. దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ అభ్యర్ధులకు రూ.215, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు లేదు.. వయసు: 2000 అక్టోబర్ 1 నుంచి 2003 సెప్టెంబర్ 30 లోగా జన్మించిన వారు దరఖాస్తు చేయొచ్చు. స్టైఫండ్: శిక్షణ సమయంలో రూ.14,600 వేతనం : రూ.21,700 - రూ.69,100.

Next Story