గుడ్డు హజ్‌బెండు.. కొడుకుని కనట్లేదని భార్యని..

వీళ్లు మారరు.. ఎంత చదువుకున్నా.. ఎంత మంది చెప్పినా.. ఎన్ని చట్టాలు వచ్చినా.. పెళ్లి చేసుకునే వరకు బాగానే ఉంటారు. పెళ్లయిన తరువాత ఎక్కడలేని లోపాలన్నీ ఎత్తి చూపుతారు. మొన్నటికి మొన్న భార్యకి ఎత్తుపళ్లున్నాయని ఓ మహానుభావుడు భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తాజాగా.. భార్య వరుసగా ఆడపిల్లలనే కంటోంది.. కొడుకును కనట్లేదని అందుకు ఆమెనే పూర్తి బాధ్యురాలిని చేస్తూ ఓ భర్త భార్యకి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. వంశాన్ని ఉద్దరించే వారసుడుని ఇవ్వనప్పుడు నువ్వు నాకు అక్కరలేదు అంటూ భార్యకు విడాకులు ఇచ్చేశాడు. హైదరాబాద్‌కు చెందిన మెహరాజ్ బేగం.. పోలీసులకు తనగోడును చెప్పుకుని వాపోతోంది. తనను వదిలించుకొని మరో పెళ్లి చేసుకుంటున్నాడని కన్నీరు మున్నీరవుతోంది. న్యాయం చేయమని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. మెహరాజ్ బేగం ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం చేసినా అర్థం పర్థం లేని కారణాలతో భార్యలను వదిలించుకుని మరో పెళ్లికి సిద్దపడుతున్నారు కొందరు ప్రబుద్ధులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com