పరిస్థితి బాగాలేదు.. కరెంట్ బిల్లు కూడా కట్టలేకపోతున్నా

పరిస్థితి బాగాలేదు.. కరెంట్ బిల్లు కూడా కట్టలేకపోతున్నా
X

sure

థియేటర్‌కి వచ్చి సినిమా చూసేవాళ్లు తగ్గిపోతున్నారు. నచ్చిన సినిమా రిలీజైన నెలరోజుల్లోపే ఇంట్లో కూర్చుని ఇంటిల్లపాదీ హ్యాపీగా చూసేస్తున్నారు. ఈ పొల్యూషన్‌లో, ఈ ట్రాఫిక్‌లో థియేటర్‌కి వెళ్లి చూడ్డం అంత అవసరమా అనే మాట అందరి నోటా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. దాంతో థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానిగా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నట్లు చెప్పారు.

సైరా, సాహోలాంటి పెద్ద సినిమాలు చూడ్డానికి మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని మిగతా సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి మాధ్యమాల్లో చూసేస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ కారణంగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని థియేటర్ యాజమాన్యాలు ఉంటే.. నేను కనీసం కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నానని సురేష్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో లేనన్ని రోజులు సింగిల్ స్క్రీన్లకు మంచి డిమాండ్ ఉండేది. పదేళ్ల క్రితం దాదాపు 3వేల వరకు సింగిల్ స్క్రీన్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1700లకు చేరుకుందని అన్నారు.

Next Story