మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
X

isro

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 25న పీఎస్‌ఎల్వీ-సి-47 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఉదయం 9 గంటల 28 నిమిషాలకు ఈ ఎక్స్‌పెరిమెంట్ జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి. కార్టోశాట్-3, హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిటర్ పర్‌ఫెక్ట్‌గానే కక్ష్యలో కి చేరినప్పటికీ, ల్యాండర్, రోవర్‌లు మాత్రం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయాయి. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ లో ప్రాబ్లెమ్ రావడంతో విక్రమ్ ల్యాండర్‌, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కూలిపోయింది. ఇది ఇస్రో బృందానికి షాక్ కలిగించింది. ఐతే ఆ నిరుత్సాహం నుంచి శాస్త్రవేత్తలు త్వరగానే బయటపడ్డారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అందులో భాగంగా పీఎస్‌ఎల్వీ-సి-47 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Tags

Next Story