పోలీస్ సారూ.. నా చెప్పులు..


సారూ.. నా ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బో, బంగారమో పట్టుకుపోలేదండి వాడు.. నా చెప్పులు.. నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న చెప్పులు.. బోలెడు ఖరీదు పెట్టి కొనుక్కున్న నా షూస్ దోచుకుపోయాడు దొంగ వెధవ. ఎలాగైనా వాడ్ని పట్టుకోరూ అంటూ స్టేషన్‌కి వచ్చి నానా హంగామా చేశాడు అబ్దుల్ హఫీజ్ అనే వ్యాపార వేత్త. చెన్నై కిలపాక్ ప్రాంతంలోని దివాన్ బహదూర్ షణ్ముగం వీధిలో జరిగింది. ఉదయం తాను ఇంట్లోనే ఉన్నానండి.. బయట గేటుకి తాళం కూడా వేసే ఉంది. అయినా ఎలా వచ్చాడు.. బంగారం లాంటి నా చెప్పులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నా 10 జతల షూస్ పట్టుకుపోయాడు అని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పక్కింటివారిపైనే అనుమానంగా ఉందని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

