రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ యువతి చేస్తున్న పని చూస్తే..

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ యువతి చేస్తున్న పని చూస్తే..
X

mba-student

మధ్యప్రదేశ్‌లోని ఓ యువతి ట్రాఫిక్ నియమాలతో పాటు హెల్మెట్ వినియోగంపై వాహనదారులను వినూత్నంగా చైతన్యపరుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని షుబీజైన్ అనే అమ్మాయి ఎంబీఏ చదువుతోంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ఆమె వాహనదారులను వినూత్నంగా చైతన్యపరుస్తోంది. కూడలి మధ్య నిల్చుని, హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతోంది.

హెల్మెట్ ధరించని వాహనదారులకు దయచేసి హెల్మెట్ ధరించండి అంటూ చేతులు జోడించి విన్నవిస్తోంది. ద్విచక్ర వాహనదారులతో పాటు కారు నడిపించే వారు కూడా సీట్‌బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పిస్తోంది. ఈ యువతి 15 రోజులుగా ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంతేకాకుండా సిగ్నల్ పడినప్పుడు విజిల్ ఊదుతూ... డ్యాన్స్ చేస్తూ వాహనదారులు ఎటు వెళ్లాలో వివరిస్తుంది.

Tags

Next Story