బస్సు‌లో వీరంగం స‌ృష్టించిన తాగుబోతులు.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు..

బస్సు‌లో వీరంగం స‌ృష్టించిన తాగుబోతులు.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు..

tagubotu

పబ్లిక్ లో విచక్షణా రహితంగా వ్యవహరిస్తే.. ఏం జరుగుతుందో తెలంగాణలోని భువనగిరిలో జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది. ఇద్దరు యువకులు ఫుల్‌గా మందుకొట్టి.. ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల్ని వేధించడం మొదలు పెట్టారు. దీంతో మహిళా ప్రయాణికులకు చిర్రెత్తుకొచ్చి వాళ్లతో గొడవకు దిగారు. వాళ్లను కూడా తిట్టడంతో ఓ ప్రయాణికుడు తిరగబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు ప్రయాణికుడిని కొట్టారు. మందుబాబులు మరింతగా రెచ్చిపోతుండటంతో.. ప్రయాణికులంతా కలిసి ఆ ఇద్దరిని చితకబాదారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జరిగింది.

హైదరాబాద్‌కు వెళుతున్న పరకాల డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. భువనరిగిలో బస్సు ఎక్కిన ఇద్దరు తాగుబోతులు న్యూసెన్స్ క్రియేట్‌ చేయడంతో ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. బస్సు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story