టీవీ5 కథనాలతో విద్యార్థినికి న్యాయం

టీవీ5 కథనాలతో విద్యార్థినికి న్యాయం

tv5

స్కూల్లో చదువుకోవాల్సిన విద్యార్ధినిని.. ఇంట్లో పనిమనిషిగా మార్చిన అధికారిని తీరుపై టీవీ-5 ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి స్టూడెంట్ నాగమణిని.. గత పది రోజులుగా ఇంట్లో పనుల కోసం వాడుకుంటోంది స్కూల్‌కు చెందిన స్పెషల్ ఆఫీసర్ యాదమ్మ. ఇదేంటని ప్రశ్నిస్తే.. తన బంధువుల అమ్మాయి అంటూ బుకాయించింది యాదమ్మ. పై అధికారులు కూడా యాదమ్మకే మద్దతు పలికారు. ఈ ఘటనపై టీవీ-5 కథనాన్ని ప్రసారం చేసింది.

టీవీ-5 కథనంపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి విచారణకు ఆదేశించింది. యాదగిరిగుట్ట M.E.Oను పాఠశాలకు పంపారు. విచారణలో యాదమ్మకు, ఆ విద్యార్థికి ఎలాంటి బంధుత్వం లేదని తేలింది. యాదమ్మ చేసింది ముమ్మాటికీ తప్పే అని చెప్పిన M.E.O... ఇదే విషయాన్ని నివేదిక రూపంలో D.E.Oకి అందిస్తామని తెలిపారు.

అటు ఈ ఘటనపై పేరెంట్స్ కమిటీ, విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పెషల్ ఆఫీసర్ యాదమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story