మెగాస్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్?

మెగాస్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్?

chiru

ఆర్ఆర్ఆర్.. మొదలైన రోజు చెప్పిన రిలీజ్ డేట్ .. 2020 జూలై 30. మామూలుగా రాజమౌళి ప్లానింగ్ పక్కాగా ఉంటుంది కాబట్టి.. ఖచ్చితంగా అదే రోజు విడుదలవుతుంది అనుకున్నారు. బట్.. లేటెస్ట్ గా అది పోస్ట్ పోన్ అయ్యింది అనేలా మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. అసలు మెగాస్టార్ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది..? దీనికీ ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్‌కూ ఉన్న సంబంధం ఏంటి..? అనుకుంటున్నారా.. కొన్నిసార్లు ఒక విషయం చెప్పాలనుకుంటే మరో మేటర్ బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ద్వారా.. రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పోస్ట్ పోన్ అయినట్టే అనే మేటర్ తెలుస్తోందంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ ను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు ప్లానింగ్ చేశారు. బట్ అనుకోకుండా ఇద్దరు హీరోలకు యాక్సిడెంట్స్ కావడం.. వాతావరణ ప్రతికూలతలు, రామ్ చరణ్ సైరా కోసం టైమ్ తీసుకోవడం వంటి కారణాలతో ఏకంగా రెండు షెడ్యూల్స్ తేడా వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ రెండు షెడ్యూల్స్ లో వచ్చిన తేడా వల్ల టైమ్ కు విడుదల చేయడం దాదాపు అసాధ్యం అని తేలింది. దీంతో వచ్చే దసరాకు లేదా 2021 సంక్రాంతికి రావొచ్చు అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమే అనేలా మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.మెగాస్టార్, కొరటాల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీని వచ్చే యేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ డేట్ ను చిరంజీవే సూచించాడు. దీంతో ఆ టార్గెట్ గా కొరటాల ప్లానింగ్ కూడా చేసుకున్నాడు.

నిజానికి ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే చిరంజీవి సినిమా వస్తుందనుకోలేం. పైగా రాజమౌళి అంటే చిరంజీవికీ గౌరవం.. తన కొడుకూ ఆ సినిమాలో ఉన్నాడు. అందుకే ఆ సినిమాను ఎఫెక్ట్ చేయాలనుకోడు. అయినా ఆగస్ట్ 14 అంటున్నారంటే ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు. మరి ఈ మేటర్ లో రాజమౌళి టీమ్ నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబితే కానీ ఈ గొడవ తేలదమో కానీ.. మెగాస్టార్ మాత్రం ఆగస్ట్ 14న ఇండిపెండెన్స్ డే ను లాక్ చేసుకున్నాడు.

Read MoreRead Less
Next Story