అంతర్జాతీయం

బంక్ బంపరాఫర్.. బికిని వేసుకుని వస్తే..

బంక్ బంపరాఫర్.. బికిని వేసుకుని వస్తే..
X

dress

ఫ్రీగా వస్తుందంటే ఏం చేయడానికైనా సిద్దపడిపోతుంటారు ఎవరైనా. అలాంటిది పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అయితే ఇక్కడ పెట్రోల్ బంకు ఓ షరతు పెట్టింది. బికినీ వేసుకుని వస్తేనే ఫ్రీ అంటూ. అయినా ఓకే.. మాకు బండిలో ఫుల్లుగా పెట్రోల్ కొట్టేస్తానంటే అంతకంటే భాగ్యమా అంటూ అబ్బాయిలంతా బికినీ డ్రెస్‌లు వేసుకుని క్యూ కట్టేసారు. రష్యా సమారాలో ఓల్వీ గ్యాస్ స్టేషన్ మేం ఊహించింది ఒకటైతే మరోలా జరిగిందేంటి చెప్మా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రకటన ఏరి కోరి మరీ అమ్మాయిల కోసం వేస్తే అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు అధిక సంఖ్యలో రావడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమ్మాయిల అందాలను ఆస్వాదించాలనుకుంటే అబ్బాయిలు ఇలా బికినీల్లో వస్తుంటే చూడలేక ఛస్తున్నాం అంటున్నారు. బికినీ డ్రెస్‌లో వచ్చిన అబ్బాయిలు డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా హైహీల్స్ కూడా వస్తున్నారు.

Next Story

RELATED STORIES