పూజకు పువ్వులు.. వాడిన పూలతో ఎరువులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టి


పూజకు పనికి రాని పువ్వు ఉంటుందేమో కాని.. పూజకు వాడిన పువ్వులు మాత్రం బంగారం లాంటి ఎరువుని ఇస్తాయి. ఆ ఎరువుతో ఆ పూల తోట మళ్లీ విరబూస్తుంది. దేశంలోని చాలా ఆలయాల్లో దేవునికి పూలతో అలంకారాలు ప్రతి రోజూ ఉంటాయి. మరునాటికి ఆ పూలు చెత్త బుట్టను చేరుతాయి. అయితే వాటిని అలా పడేయకండి. వాటితో సేంద్రియ ఎరువులను తయారు చేయవచ్చు అంటున్నారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఉన్న సిల్వర్ ఓక్ ఇంజనీరింగ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న యష్ భట్, అర్జున్‌లు ఆలయాల నుంచి వచ్చే వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. వారు అహ్మదాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో నిత్యం 300 కిలోల పువ్వులు, కొబ్బరి పీచు వంటి వాటితో 100 కిలోల ఎరువును తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ఎరువుని కిలోకు రూ.60 చోప్పున విక్రయిస్తున్నారు. తమ ప్రాజెక్ట్ మేనేజర్ సమాజానికి ఉపయోగపడే, సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. ఆయన మాటలనే ఆదర్శంగా తీసుకున్న ఈ ఇద్దరు విద్యార్థులు దేవాలయ వ్యర్థాలతో ఎరువులను రూపొందించే యంత్రాలను కనిపెట్టారు. కాగా, వీరి ప్రాజెక్టు అహ్మదాబాద్‌లోని బొడక్‌దెవ్, థాట్లెజ్, ఘట్లొడియా, నరన్‌పురలలో ఉన్న 22 ఆలయాల పరిధిలో కొనసాగుతోంది. త్వరలో మరిన్ని ఆలయాలకు తమ సేవలను వినియోగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

