ESI కుంభకోణం : విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు

ESI కుంభకోణం : విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు

esi

ESI కుంభకోణంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలెన్నో బయటపడుతున్నాయి. ఐఎంఎస్ అధికారులు సొంతంగా డొల్ల కంపెనీలు స్థాపించి.. పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. దేవికారాణి ఒక్కరే ఏకంగా 38 డొల్ల కంపెనీలు పెట్టినట్టు గుర్తించారు. వీటి ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఆమెతో పాటు పలువురు అధికారులు కూడా ఈ అక్రమాల్లో భాగంపంచుకున్నట్టు విచారణలో గుర్తించారు. ఎవరికి వారు డొల్ల కంపెనీలు సృష్టించి.. నిధులు పక్కదారి మళ్లించారు.

దేవికారాణి సహా ఈ కేసులో ఉన్న నిందితులు డొల్ల కంపెనీల ద్వారా ఎంతమొత్తం మళ్లించారు.. ఎవరెవరి ఖాతాలకు నిధులు వెళ్లాయన్న దానిపై ఆరా తీస్తున్నారు విచారణాధికారులు. ఇందులో భాగంగానే దేవికారాణితో పాటు.. సహాయ సంచాలకులు వసంత ఇందిరలను రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ వారి నుంచి మరింత సమాచారం సేకరించింది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నాలుగేళ్లలో సుమారు 250 కోట్ల రూపాయలు దారిమళ్లించినట్టు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

Tags

Next Story