ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి?

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి?
X

kirankumarreddy

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారా..? ప్రస్తుత పరిణామాలు, ఏపీ ఇన్‌ఛార్జ్ ఊమెన్ చాందీ నివేదికల్ని బట్టి చూస్తే కిరణ్‌కే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ చింతా మోహన్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ సహా సీనియర్లు పోటీపడినా..విస్తృత సంప్రదింపుల తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డివైపే అంతా మొగ్గు చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కూడా బలహీనంగానే ఉన్నాయని సరైన ప్రణాళికతో ముందుకెళ్లి ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటే భవిష్యత్ ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది. అందుకే కిరణ్ కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రస్తుతం ఉనికికోల్పోయిన పరిస్థితిలో ఉంది. మొదట్నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న రాజకీయ కుటుంబాలకు చెందిన వాళ్లు తప్ప మిగతావాళ్లంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇటీవలి కాలం వరకూ రఘువీరారెడ్డి PCC చీఫ్‌గా ఉన్నా.. ఆయన కూడా ఇప్పుడు పదవిలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. రాజీనామా చేసి దాదాపు 6 నెలలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను నడిపించే లీడర్‌ కోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్ చాందీ ప్రయత్నాలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలతో చర్చలు జరిపారు. చివరికి కిరణ్ కుమార్‌ రెడ్డి పేరుపై ఏకాభిప్రాయం వచ్చింది. రోశయ్య తర్వాత సీఎం అయిన సమైక్యగళాన్ని గట్టిగానే వినిపించారు. విభజన విషయంలో హైకమాండ్‌తో విభేదించి పార్టీని వీడారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ ఆయన మళ్లీ సొంత గూటికే వచ్చినా యాక్టివ్‌గా లేరు. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని హైకమాండ్ భావిస్తోంది. కిరణ్ లాంటి వ్యక్తికి సారధ్యం అప్పగిస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని అంచనా వేస్తోంది. AP నేతల అభిప్రాయాలపై ఊమెన్ చాందీ నివేదిక ఇప్పటికే సోనియాకు చేరింది. త్వరలోనే కొత్త PCC చీఫ్‌పై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

Tags

Next Story