పదవతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో ఖాళీల భర్తీ..

పదవతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో ఖాళీల భర్తీ..

railway-jobs

నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనుంది. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబర్ 16. మొత్తం ఖాళీలు: 16.. అథ్లెటిక్స్: 1.. బాస్కెట్ బాల్:3.. సైక్లింగ్:2.. క్రికెట్:1.. పవర్ లిప్టింగ్: 2.. వాలీబాల్ :1.. వెయిట్ లిప్టింగ్: 3.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 16 సాయింత్రం 5.30 గంటలు.. విద్యార్హత: 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్లు. స్పోర్ట్స్ నిబంధనలు: స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న పోస్టులు కావునా నిబంధనల ప్రకారం ఆయా క్రీడల్లో ప్రతిభా నైపుణ్యాలు చూపిన వారే అర్హులు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://nfr.indianrailways.gov.in చూడొచ్చు.

Read MoreRead Less
Next Story