ఎల్ఎల్‌బీ చదివి.. ఏ ఉద్యోగం లేక..


ఇష్టంగా కష్టపడి చదువుకున్నాడు. ఎల్ఎల్‌బీ చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే అనుకున్నాడు. అతడి ఆశ నిరాశే అయింది. అతడికి నాటకాలంటే ఇష్టం. వాటినే ఉపాధి అవకాశంగా మార్చుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా తునికి చెందిన నూకాజీ ఉన్న ఊరిలో బ్రతుకుదెరువు లేక పట్నం బాట పట్టాడు. నాటకాలంటే ఉన్న అభిమానంతో హైదరాబాదుకు వచ్చి వివిధ వేషధారణలతో నగరంలో తిరుగుతూ వినూత్న ఆలోచనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నాతో సెల్ఫీ దిగితే జస్ట్ రూ.50లు ఇచ్చుకుంటే చాలు. మీకు సరదా.. నాకు సంతోషం అని అంటూ ఓ బోర్డుని తయారు చేసి మెడలో వేసుకున్నాడు. ఇలా తాను రోజుకు కనీసం వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతడిని ఫోటోను చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్రతకాలంటే పట్నంలో బోలెడు అవకాశాలు ఉంటాయి. అంత చదువుకుని సెల్ఫీ పేరుతో డబ్బు సంపాదించడం కరెక్టు కాదు అని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

