కంట్లో ఏలిక పాము.. ఎలా చేరిందో తెలిస్తే..


కంట్లో చిన్న నలక పడితే తీసిందాకా నిద్ర పట్టదు. మరి అలాంటిది 12 ఏళ్లుగా అతడి కంట్లో ఏలిక పాము వుంటే ఎలా భరించావు బాబు అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు అతడిని చూసి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కంట్లో ఏలిక పాము తిష్ట వేసిన విషయం అతడికి కూడా తెలియకపోవడం. గుజరాత్‌కు చెందిన 70 ఏళ్ల జాసుబాయ్ పటేల్ గత కొన్నేళ్లుగా కన్ను నొప్పి, దురదతో బాధ పడుతున్నాడు. అతి మరీ తీవ్రంగా ఉండకపోవడంతో అశ్రద్ధ చేశాడు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా.
కానీ ఈ మధ్య నొప్పి భరించరానిదిగా ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతడి కంటిని పరీక్షించిన డాక్టర్లు కన్ను తెల్లగుడ్డుని చుట్టుకుని మెరుస్తున్న సన్నని ఏలిక పామును బయటకు తీశారు. ఎప్పటి నుంచి నొప్పిగా, దురదగా ఉంటుంది అని డాక్టర్లు అతన్ని అడగ్గా.. పన్నెండేళ్ల క్రితం తనని కుక్క కరిచిందని చెప్పాడు. అప్పడు రేబిస్ వ్యాధి రాకుండా ఇంజక్షన్ కూడా తీసుకున్నట్టు చెప్పాడు. అయితే డాక్టర్లు అతడికి కుక్క కరిచిన సమయంలో ఏర్పడిన గాయం ద్వారా పరాన్న జీవి రక్తంలో కలిసి కంటిని చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
మధ్యల్లో ఒకటి, రెండు సార్లు హాస్పిటల్‌కు వెళ్లినా కంటిని పరీక్షించి నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చి పంపించే వారే కానీ సమస్యకి పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. దీంతో జాసూ పటేల్.. భరూచ్‌లోని నారాయణ్ హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్‌లో పని చేస్తున్న డాక్టర్ మిలన్ పాంచాల్‌ను కలిశాడు. ఆయన మైక్రోస్కోపిక్ పరికరంతో పటేల్ కంటిని పరిశీలించగా.. తెల్లగుడ్డు వెనుక ఏదో దారం లాంటిది కనిపించింది. దాని కదలికలను బట్టి ఏలిక పాముగా గుర్తించారు. దాన్ని సర్జరీ చేసి తొలగించాలని లేకపోతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. సర్జరీని అతి జాగ్రత్తగా చేసిన వైద్యులు జాసు కంటిలో నుంచి తెల్లగా, సన్నగా 7 సెంటీ మీటర్ల పొడవు వున్న ఏలిక పాముని బయటకు తీశారు. సాధారణంగా కంటికి కనిపించని సూక్ష్మజీవులు గాయాలైనప్పుడు శరీరంలోకి చేరుతుంటాయి. శుభ్రత పాటిస్తూ, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

