ఆర్టీసీ సమ్మె.. కిషన్‌ రెడ్డి నేతృత్వంలో నితిన్‌ గడ్కరీని కలిసిన బీజేపీ ఎంపీలు

ఆర్టీసీ సమ్మె.. కిషన్‌ రెడ్డి నేతృత్వంలో నితిన్‌ గడ్కరీని కలిసిన బీజేపీ ఎంపీలు
X

ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన బీజేపీ ఎంపీలు.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతామని నితిన్‌ గడ్కరీ చెప్పినట్లు ఎంపీలు తెలిపారు. త్వరలోనే తెలంగాణ రవాణా మంత్రి, అధికారులను ఢిల్లీ పిలిపించి సమావేశం నిర్వహిస్తామని చెప్పారన్నారు. ఆర్టీసీ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునేందుకు పూర్తి అధికారం ఉందన్నారు బీజేపీ ఎంపీలు. ఎలాంటి షరతులు లేకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలన్నారు బీజేపీ ఎంపీలు.

Next Story