ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి

ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి

anitha

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఇందులో భారతీయ సంతతికి చెందిన హిందూ మహిళ అనితా ఇందిరా ఆనంద్‌ కు అవకాశం కల్పించారు. దీంతో ట్రూడో మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్‌గా ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. దీంతో అక్టోబర్‌లో జరిగిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభకు ఆమె అర్హత సాధించారు. కెనడా రాష్ట్రం టొరంటోలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిప్రయత్నంలోనే ఎంపీగా ఎన్నికవ్వడమే కాకుండా మంత్రివర్గంలో చోటుదక్కించుకోవడం విశేషం. బుధవారం ఏర్పాటైన నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారు కూడా ట్రూడో క్యాబినెట్ లో చోటుదక్కించుకున్నారు. వీరంతా ఇండో-కెడియన్‌కు చెందిన సిక్కు వర్గానికి చెందిన వారు.

Tags

Read MoreRead Less
Next Story