వృద్ధుడి దృష్టి మరల్చి ఏటీఎం కార్డు దొంగలించిన కేటుగాడు

వృద్ధుడి దృష్టి మరల్చి ఏటీఎం కార్డు దొంగలించిన కేటుగాడు
X

atm

ఓ వృద్ధుడి దృష్టి మరల్చి ATM కార్డు దొంగలించిన కేటుగాడు 50 వేల రూపాయలకు పైగా స్వాహా చేశాడు. డబ్బులు విత్‌డ్రా అయినట్లు తన మొబైల్‌కు మెసేజ్‌లు రావడంతో అసలు విషయాన్ని గుర్తించాడా వృద్ధుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. సుధాకర్‌రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి.. డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎంకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. సాయం చేస్తున్నట్లు నటించి.. ఏటీఎం కార్డును దొంగిలించాడు. పిన్‌ నెంబర్‌ కూడా తెలుసుకొని డబ్బులు స్వాహా చేశాడు. ఏటీఎంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Tags

Next Story