బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో ఆపరేషన్ కమల్‌కు తెరపడలేదా..? విపక్షాల నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను లాగే పనిలో కమలనాథులు నిమగ్న మయ్యారా..? ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌లకు మళ్లీ షాక్ తగలనుందా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే కన్నడనాట చర్చనీ యాంశమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రేణుకాచార్య వెల్లడించారు. జేడీఎస్, కాంగ్రెస్‌లలో ముఖ్యనేతల తీరుతోనే 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. మరోసారి సీఎం కావా లనుకున్న సిద్దరామయ్య ఆశలు నెరవేరలేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక కుమారస్వామి గందరగోళంలో పడిపోయారని విమర్శించారు. కుమారస్వామికి గెలిచే సత్తా గానీ, బీజేపీని ఓడించే శక్తి గానీ లేవన్నారు. రాష్ట్ర బీజేపీలో ఎటువంటి విభేధాలూ లేవని, 15 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు.
ఉపఎన్నికల్లో గెలుపోటములపై రేణుకాచార్య వ్యాఖ్యలను పక్కకు పెడితే, కాంగ్రెస్ నుంచి జంప్ కావడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బై ఎలక్షన్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరోసారి ఆపరేషన్ కమల్‌కు పదును పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను సమూలంగా దెబ్బతీసే రీతిలో కమలనాథులు పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికల తర్వాతే ఆపరేషన్ ఆకర్ష్‌పై స్పష్టత వస్తుందంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com