బ్రేక్‌ఫాస్ట్ తినకుండా బడికెళ్తే..

బ్రేక్‌ఫాస్ట్ తినకుండా బడికెళ్తే..

kids

ఏమీ తినకుండా ఎలా వెళ్తావురా అన్నా వినకుండా.. నాకేమీ వద్దు బై.. అంటూ బస్సెక్కేస్తుంటారు పిల్లలు. ఆకలితో ఉన్నా ఆటపాటల్లో పడి ఆ విషయాన్నే మర్చిపోతుంటారు. ఇలా అయితే టీచర్లు చెప్పే పాఠాలు తలకెక్కవు.. పరీక్షల్లో మంచి మార్కులు రావు అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులు లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. స్కూలుకు వెళ్లే చిన్నారులకు తగిన పోషకాలు అందకపోతే అది వారి మార్కులపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్త కేటీ అడోల్పస్ తెలియజేస్తున్నారు.

వెస్ట్ యార్కషైర్‌లోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 294 మంది విద్యార్థులపై పరిశోధకులు సర్వే చేశారు. మరి కొంత మంది కాలేజీ పిల్లలు నాజూగ్గా ఉండాలి.. బరువు తగ్గాలి అంటూ బ్రేక్ ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. రాత్రి నుంచి ఏమీ తినకుండా వుంటాం కాబట్టి కడుపు ఖాళీగా ఉంటుంది. ఎక్కువ సేపు అలాగే ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. దాంతో కడుపులో మంట వస్తుంది. అందుకే ఉదయం అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు.

Read MoreRead Less
Next Story