మల్లాడి కృష్ణారావు నివాసానికి సీఎం జగన్

మల్లాడి కృష్ణారావు నివాసానికి  సీఎం జగన్
X

cm-jagan

ఏపీ సీఎం జగన్‌... గురువారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రామాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం మండలంలోని కొమనాపల్లిలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుండి బయలుదేరి 9.45 గంటలకు ముమ్మడివరం మండలం గాడిలంకకు చేరుకుంటారు. అక్కడి నుండి 9.50కు ఐ పోలవరం మండలం పశువుల్లంక గ్రామం చేరుకుని అక్కడి నుండి వలసలతిప్ప హైలెవల్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

ఉదయం 10.30కు ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొమనాపల్లిలో మత్స్యకార భరోసా ప్రారంభ వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుండి 11.45 గంటల మధ్య 78 కోట్ల రూపాయల మేర పెండింగ్‌లో ఉన్న జీఎస్‌పీసీ బకాయిలను లబ్దిదారులకు అందజేస్తారు. మధ్యాహ్నం 12.25కు యానాం చేరుకుంటారు. అక్కడ పుదుచ్చేరి ఆరోగ్య శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుని ఆయన తండ్రి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.

Tags

Next Story