'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్
X

ka-paul

కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మత ప్రబోధకుడు, రాజకీయనేత కేఏపాల్ ఈ సినిమాపై కోర్టుకు వెళ్లారు. తనని అవమానించేలా చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్నది ఆయన ప్రధాన అభియోగం. ఈనెల 29న చిత్రం విడుదల చేస్తున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు దీనిపై హైకోర్టు ఏం చెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేఏ పాల్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డుతోపాటు.. రాంగోపాల్‌వర్మ, జబర్దస్త్ కమెడియన్ రాము పేర్లు చేర్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చిత్రంలో తన పాత్రను చూపించారని ఆయన వాదిస్తున్నారు.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ దశ నుంచే వివాదాలతో ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు వర్మ. సినిమాను చంద్రబాబు, లోకేష్‌లను కించపరిచేందుకే తీసినట్టుగా ఉందని TDP నేతలు రగిలిపోతున్నారు. పవన్ అభిమానులది కూడా ఇదే పరిస్థితి. దీనిపై ఎవరు మాట్లాడినా వివాదం అయ్యేకొద్దీ వర్మ దాన్ని తన పబ్లిసిటీకి అనుకూలంగా మార్చుకుంటాడన్న ఉద్దేశంతో.. మిన్నకుండిపోయారు. కేఏ పాల్ మాత్రం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

Tags

Next Story