పునాదిరాళ్లు దర్శకుడికి 'పూరి' సాయం..

పునాదిరాళ్లు దర్శకుడికి పూరి సాయం..

POORI

మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా పేరైతే సంపాదించుకున్నారు కానీ.. ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు పడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్. అనారోగ్యంతో బాధపడుతూ సరైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులేని పరిస్థితిలో కొడుకు మీద ఆధారపడుతూ బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు. ఆయన పరిస్థితి మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో సినిమా పరిశ్రమకు చెందిన అనేకమంది సహృదయంతో స్పందించారు. తోచిన మేరకు సహాయం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూ.50వేలు అందించారు. మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ.10 వేలు, నటుడు, దర్శకుడు అయిన కాశీ విశ్వనాథ్ రూ.5 వేలు చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. ఇంతకు ముందు మనం సైతం తరపున నటుడు కాదంబరి కిరణ్ కుమార్ రూ.25 వేల నగదు ఆయనకు అందించారు. ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్‌నర్ సురేష్ రెడ్డి రూ.41 వేలు అందజేశారు.

Read MoreRead Less
Next Story