రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
X

rajinikanth

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ జోరు పెంచుతున్నారు. సంచలన వ్యాఖ్యలతో తమిళనాట కలకలం రేపుతున్నారు. తాజాగా రజనీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు. 2021లో తమిళనాడు ప్రజలు పెద్ద అద్భుతం చూడబోతున్నారని కబాలీ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందన్నారు. ఇఫీ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌తో పొత్తుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తలైవా సమాధానమిచ్చారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటే సీఎం ఎవరు అవుతారనే ప్రశ్నకు జవాబిచ్చిన రజనీ, 2021 శాసనసభ ఎన్నికల్లో మహాద్భుతం జరుగుతుందన్నారు. ఆ ఎన్నికల్లో తమిళ ప్రజలు సంచలనం సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు.

Tags

Next Story