బ్రతుకు భారమైనా భార్యా బిడ్డల్ని పోషించడం కోసం..

బ్రతుకు భారమైనా భార్యా బిడ్డల్ని పోషించడం కోసం..
X

ramesh

విధి విచిత్రాలెన్నో చేస్తుంది. భార్యా, ముగ్గురు పిల్లలతో బతుకు బండిని సాగిస్తున్నాడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన కొత్త రమేష్. గీత కార్మికుడైన రమేష్ ఎనిమిదేళ్ల క్రితం తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ క్రింద పడిపోయాడు. దీంతో వెన్నెముక దెబ్బతిని రెండు కాళ్లు విరిగిపోయాయి. అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కూర్చునే పరిస్థితి లేదు. నాలుగెకరాల పొలం ఉన్నా సొంతంగా సాగు చేసుకునే అవకాశం లేదు. భార్య, కూలీల సాయంతో సాగు చేయిస్తున్నాడు. ప్రత్యేకంగా మూడు చక్రాల వాహనాన్ని తయారు చేసుకుని రోజూ పొలానికి వెళుతుంటాడు. కూర్చోవడానికి వీల్లేనందున పడుకునే వాహనాన్ని నడుపుతుంటాడు. ఇలా వెళ్లడం కష్టంగా ఉన్నా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేదంటున్నాడు. ముగ్గురు ఆడ పిల్లలు ఇంటర్, 10,9 వతరగతి చదువుతున్నారు. ప్రభుత్వం సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.

Next Story