చిత్తూరు అడవిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

X
By - TV5 Telugu |21 Nov 2019 11:40 AM IST
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియల అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట కోసం పంటపొలాల్లో అధికారులకు తెలియకుండా కరెంటు తీగలు అమర్చుతుంటారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ తీగలు తగిలి మృతి చెందినట్టు తెలుస్తోంది.
విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆ యువకుడి శవాన్ని ఎవరికి తెలియకుండా అటవీ ప్రాంతంలోనే కాల్చి బూడిద చేసి ఉంటారని భావిస్తున్నారు. పశువుల కాపరులకు అనుమానం రావడంతో విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com