అమెరికా-భారత్ మధ్య రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందం

అమెరికా-భారత్ మధ్య రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందం

modi-and-trump

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఇండియన్ నేవీ కోసం భారత ప్రభుత్వం అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా అమెరికా-భారత్ మధ్య 7 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్ ప్రకారం 13-MK-45-5 ఇంచ్/62 కేలిబర్ నావెల్ గన్స్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా అనుమతి ఇచ్చింది.

అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్ 13-MK-45 నావెల్ గన్స్‌ తయారు చేస్తోంది. ఈ నావెల్ గన్స్‌తో శత్రువుల ఆయుధ వ్యవస్థ నుంచి రక్షణ లభిస్తుంది. యాంటీ స‌ర్ఫేస్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిష‌న్స్ స‌మ‌యంలో ఎంకే-45 గ‌న్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డతాయి. ఈ డీల్‌తో భారత నౌకాదళంలోకి కొత్త అస్త్రాలు చేరనున్నాయి. అలాగే, అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంలో భారతదేశం మారనుంది.

Tags

Read MoreRead Less
Next Story