రాణూ మోండల్.. మేకప్ వెనుక.. వీడియో

రాణూ మోండల్.. మేకప్ వెనుక.. వీడియో
X

TTమేకప్ మాయాజాలం.. సాధారణ వ్యక్తులను కూడా అందంగా మార్చేస్తుంది. మేకప్‌తో చూసిన వారిని బయట పోల్చుకోవడం ఒకింత కష్టమే. ఒక్కపాటతో సెలబ్రిటీ హోదా దక్కించుకున్న రాణూ మోండల్ మేకప్ కూడా ఆమె పాటిన పాట కంటే ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమెకు మేకప్ చేసిన సంధ్య నెటిజన్స్ చేసిన ట్రోల్స్‌పై స్పందించారు. తాను తక్కువగానే మేకప్ వేసినా ఫోటోని ఎడిట్ చేసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాణూ కాన్సూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేయడం కోసం కొద్దిగా మేకప్ వేయవలసి వచ్చింది. దాన్ని ట్రోల్ చేస్తూ అనవసరమైన కామెంట్లు చేశారు. అలా అనే ముందు ఓ సారి ఆలోచించాలి. ఎదుటి వారు ఎంత బాధపడతారో అని. ఎంతో ఓపిగ్గా తాను చేసిన మేకప్‌ ఒక్క ఫోటో కారణంగా ఆర్టిస్ట్ శ్రమని వృధా చేశారని వాపోతోంది. తాను రాణూకి మేకప్ చేసిన ఒరిజినల్ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే తాను ఎంత కష్టపడి మేకప్ చేశాననేది తెలుస్తుందన్నారు.

Next Story