పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి

X
By - TV5 Telugu |22 Nov 2019 12:10 PM IST
రాజమహేంద్రవరంలో కానిస్టేబుల్ పై విచక్షణరహితంగా దాడిచేశారు కొందరు యువకులు. ఆనందనగర్ ఆటోస్టాండ్ వద్ద కానిస్టేబుల్ నాగేశ్వరరావు వెళ్తుండగా వెనకవైపు నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. నిబంధనలకు విరుద్దంగా రావడమే కాకుండా.. ఢీకొట్టడంతో వీరిని ఫోటోలు తీసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించాడు. దీంతో.. ఆ ముగ్గురు యువకులు ఒక్కసారిగా దాడికి దిగారు.
రాజమహేంద్రవరంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తీవ్రగాయాలైన కానిస్టేబుల్ నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com