ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నఅమరావతి ప్రాంత రైతులు

ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నఅమరావతి ప్రాంత రైతులు
X

amaravathi

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ ఆంశంపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడటంపై మానసిక వేదనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే అసెంబ్లీ జరిగినన్ని రోజులు తమకు కేటాయించిన ఫ్లాట్ల వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ముఖ్యమంత్రి సానుకూల ప్రకటన చేస్తే ఆందోళన విరమించుకుంటామని రైతులు చెబుతున్నారు.

Tags

Next Story