పింక్ బాల్ టెస్ట్.. బంగ్లా బ్యాటింగ్
భారత గడ్డపై తొలిసారిగా పింక్ బాల్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది. టీమిండియాతో జరుగుతున్న ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు మార్పులు లేకుండా బరిలోకి దిగితే.. బంగ్లాదేశ్ రెండు మార్పులతో బ్యాటింగుకు దిగింది. తైజూల్, మెహిదీ స్థానంలో ఆల్-అమీన్, నయీమ్ జట్టులోకి తీసుకుంది.
ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. డేనైట్ టెస్టు కోసం సాధారణంగా రెడ్ బాల్స్ వాడతారు. కానీ ఇప్పుడు పింక్ బాల్‌ను వాడుతున్నారు. ఇప్పటికే SG బాల్ వాడుతున్నారు. ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్ బాల్‌తో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కానీ సారథి విరాట్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలిసారి పింక్ బాల్‌తో ఆడనుండటం విశేషం.
పింక్ బాల్.. పైగా డే నైట్ మ్యాచ్... ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేశారు.
చారిత్రాత్మక తొలి టెస్టు కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సిటీలోని ప్రధాన వీధులన్నీ గులాబీమయం అయ్యాయి. చారిత్రక టెస్టు చూసేందుకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. భారత్‌లో అతిపెద్దదైన క్రికెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం 67వేలు. మొత్తం టికెట్లు అమ్ముడుపోవడం రికార్టే.. అది టెస్ట్ మ్యాచ్ అయినా అమ్మకాలు ఈ రేంజిలో ఉండడంతో BCCI ఆనందం వ్యక్తం చేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com