ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు
X

01

తూర్పుగోదావరి జిల్లాలో లారీ ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ రూరల్‌ మండలం అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ బస్సు రాజోలు నుండి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. లారీ కాకినాడ పోర్టు నుంచి సత్తుపల్లి వెళ్తుంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. నిద్ర మత్తులో లారీ డ్రైవర్‌.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడినట్లు అధికారులు నిర్ధారించారు. క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story