బలవంతంగా ఇంగ్లిష్ రుద్దితే ఎలా? : సుజనా చౌదరి

ఏపీలోని గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపై దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. అంతర్జాతీయంగా అవకాషాలను అందిపుచ్చుకునేలా..భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఆటంకాలు లేకుండా ఉండాలంటే ప్రైమరీ దశ నుంచే ఇంగ్లీష్ మాంద్యమంలో విద్య అందించాలని ప్రభుత్వం వాదిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాంద్యమాన్ని అమలు చేయటంతో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే..ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంగ్లీష్ లో విద్యపై టీచర్ల సన్నద్ధత..ఇప్పటికే ఐదో తరగతిలో ఉన్న విద్యార్ధులు ఒక్క సారిగా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ లో చదువుకోగలరా అనే ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి. తగిన ఏర్పాట్లు చేయకుండానే బలవంతంగా ఇంగ్లిష్ రుద్దితే ఎలా అని ప్రశ్నించారు. ఏపీలోని సగానికిపైగా హైస్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా...పిల్లలు చేరేందుకు ఆసక్తి చూపడం లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు సుజనా చౌదరి.
ప్రభుత్వ స్కూళ్ల నుంచి తెలుగు భాషను తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇంగ్లిష్ మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలన్నారు.
అయితే..ఇంగ్లీష్ మీడియంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న ప్రతీ ఒక్కరి పిల్లలు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదువుతున్నారంటూ కౌంటర్ ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com