ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. కేంద్రం ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్16కి వాయిదా వేసింది.
చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదంటూ బుధవారం తేల్చిచెప్పింది కేంద్ర హోంశాఖ. ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. పౌరసత్వం రద్దు చేస్తూ 13 పేజీల ఉత్తర్వులిచ్చింది. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా సిటిజన్‌షిప్ పొందారని.. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని తెలిపింది. తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ చెన్నమనేని అఫిడవిట్ లో పేర్కొనడంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టారు రమేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com