క్లాస్‌రూమ్‌లో పాముకాటు.. బాలిక మృతి

పాము కాటుకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది కేరళ ప్రభుత్వం. ఈ ఘటన వయనాడ్ ప్రాంతంలోని సుల్తాన్ బథేరీలోని ఒకేషనల్ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్నేహలా షెరీన్ (10) కాలు క్లాస్‌రూమ్‌లోని చిన్న రంధ్రంలో ఇరుక్కుంది. అయితే ఆ బాలికకు తన కాలును ఏదో కుట్టినట్టు అనిపించింది. ఈ విషయాన్ని పాఠం చెబుతోన్న క్లాస్ టీచర్ షీజిల్‌కు చెప్పగా.. ఆమె ఏదో గీసుకుపోయి ఉంటుందని అనుకోని తన పాఠాన్ని కొనసాగించింది.
కొద్దిసేపటికి ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె తండ్రికి సమాచారం అందించారు. బాలిక తండ్రి పాఠశాలకు చేరుకుని ఆస్పత్రికి తీసుకెళుతున్నాడు. అయితే దురదృష్టవశాత్తు బాలిక మార్గం మధ్యలోనే కన్నుమూసింది. అయితే బాలిక నొప్పితో విలవిల్లాడుతున్నా ఆమెను పట్టించుకోకుండా పాఠాన్ని కొనసాగించడం కారణంగా విషం శరీరం మొత్తం పాకి బాలిక మృతిచెందిందని.. బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు.. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన క్లాస్ టీచర్ షీజిల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com