ఇక్ఫాయ్ లా స్కూల్ ఆధ్వర్యంలో లెక్స్ వాక్‌..

ఇక్ఫాయ్ లా స్కూల్ ఆధ్వర్యంలో లెక్స్ వాక్‌..

walk

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్ఫాయ్ లా స్కూల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద లెక్స్ వాక్‌ నిర్వహించింది. ఐదు కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ నడకను జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన లెక్స్‌ వాక్ సంజీవయ్య పార్క్ చేరుకొని.. అక్కడి నుంచి తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది. ఈ వాక్‌లో ఇక్ఫాయ్ సొసైటీ ఛైర్‌పర్సన్ శోభారాణి యశశ్వితో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 2వేల మందితో జరిగిన వాక్ విజయవంతమైందని.. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ.. దానిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వాక్ నిర్వహించామని నిర్వాహకులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story