మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతి

మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతి
X

map

ఏపీ రాజధానిపై రాష్ట్రంలో ఆయోమం కొనసాగుతూనే ఉంది. మంత్రుల ప్రకటనలు..ప్రభుత్వ నిర్ణయాలు అమరావతిపై జనాల్లో అనుమానాలకు తావిస్తోంది. దీంతో అమరావతి కోసం పచ్చని పంటభూములు ఇచ్చిన రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు.

ఇది ఏపీ రాజధానిపై నెలకొన్న సందిగ్థత. ఇది చాలదన్నట్లు కేంద్రప్రభుత్వం కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన మ్యాప్ లో అసలు ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావనే లేదు. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇదే అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అవమానకరమేనని స్పష్టం చేశారు.

జయదేవ్ అభ్యంతరాలతో తప్పును తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రివైజ్డ్ మ్యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇండియా మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తింటతో ఎంపీ గల్లా జయదేవ్ పై ప్రశంసలు కురిపించారు లోకేష్. లోక్‌సభలో పోరాడి, అమరావతిని చేర్చి సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్‌ని విడుదల చేసేలా కృషి చేసిన గల్లా జయదేవ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు లోకేష్.

Tags

Next Story