ఏపీలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పంట పండుతోంది. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులు ఊరట చెందుతున్నారు. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లాలో మెయిన్ అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీలు: 489.. చిత్తూరు జిల్లాలోని బంగారు పాలెం, చంద్రగిరి, కుప్పం, మదనపల్లె, నగరి, పలమనేరు ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 30. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://chittoor.ap.gov.in/వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంను వెబ్‌సైట్ నుంచి డైన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఐసీడీఎస్ కార్యాలయంలో తీసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును నవంబర్ 30లోగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేసి రసీదు తీసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 489.. అంగన్‌వాడీ హెల్పర్: 343.. మినీ అంగన్‌వాడీ వర్కర్: 83.. మెయిన్ అంగన్‌వాడీ వర్కర్: 63 పోస్టులు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com