మీ ఇంట్లో పెళ్లా.. శుభలేఖ తీసుకుని వస్తే కిలో ఉల్లి రూ.25కే..

ఉల్లిధర వినియోగదారుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. రోజూ ఇంట్లో వంటకి ఉల్లి కొనాలంటే రేటు చూసి బెదిరిపోతున్నారు. కిలో ఉల్లి తెచ్చి జాగ్రత్తగా వాడు.. అవసరమైతేనే వెయ్యమంటూ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. మరి పెళ్ళంటే ఎన్ని వంటలు.. ఎంత ఖర్చు. ధర చూస్తే బంగారం ధరలను గుర్తుకు తెస్తోంది. పెళ్లి ఉన్న ఇంట ఊరటనిచ్చే శుభవార్తను వినిపించింది బీహార్ ప్రభుత్వం. ఇప్పటికే సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేసి బయట మార్కెట్లో రూ.75లకు ఇస్తుంటే.. ఇక్కడ రూ.35లకే అందిస్తున్నారు. ఇక పెళ్లి కార్డుతో వచ్చిన వారికి కిలో ఉల్లి రూ.25లకే అందిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునే వారికి భారం కాకుండా ఉండేందుకు ఈ విధమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ఉల్లి కొనుగోలు చేసేవారు ముందుగా తమ పేరు, ఫోన్ నెంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com