ఆర్టీసీలో శాశ్వత పరిష్కారం కోసం దిద్దుబాటు చర్యలు తప్పవు.. సీఎం కేసీఆర్

ఆర్టీసీలో శాశ్వత పరిష్కారం కోసం దిద్దుబాటు చర్యలు తప్పవు.. సీఎం కేసీఆర్

167447-kcr

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని మొదట్నుంచి తన వాదన వినిపిస్తున్నారు సీఎం కేసీఆర్. పండగ ముందు సమ్మె పిలుపుపై ఫైర్ అయిపోయారు. అయిందేదో అయ్యింది ఇక డ్యూటీలకు రండి అంటూ రెండుసార్లు డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ఈ డెడ్ లైన్ సమయంలోనూ 48 వేల కార్మికుల్లో కేవలం వందల్లోనే విధుల్లోకి హజరయ్యారు. దీంతో రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు జారీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయానికి కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దాదాపు 47 రోజులు సమ్మె తర్వాత మూడ్రోజుల క్రితం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. అయితే..బేషరతుగా తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు..సమ్మెకు ముందు ఉన్న వాతావరణమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే..రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ప్రైవేటీకరణపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో దీంతో ఆర్టీసీకి సంబంధించిన కేసులన్నీ క్లియర్ అయ్యాయి. మరి సీఎం 48 వేల మంది కుటుంబాల భవిష్యతుపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కార్మికులతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టులో తేల్చుకోవాలని, దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ముగించింది. ఆర్టీసీ యాజమాన్యం ఒక ఆదర్శ యజమానిగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని కోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఆర్టీసీలో శాశత్వ పరిష్కారం కోసం దిద్దుబాటు చర్యలు తప్పవన్న సీఎం.. ఆర్టీసీలో సమ్మె పేరు వినపడొద్దని, ఆర్టీసీలో యూనియన్ల ప్రస్తావన ఉండొద్దనే షరతులు విధించారు. కార్మికులు ప్రభుత్వ షరతులకు ఆమోదం తెలిపితేనే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని అంటున్నారు సీఎం. అయితే.. 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తే కార్మికుల పరిస్థితి ఏమిటి? అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించి మూడ్రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవటంతో కార్మికులు సమ్మెను కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. శనివారం అన్ని డిపోల ముందు సేవ్ ఆర్టీసీ పేరుతో ఆందోళన చేపట్టనున్నాయి.

Tags

Next Story