నటికి గుండెపోటు.. క్లిష్టంగా ఆరోగ్య పరిస్థితి

నటి, మోడల్ గెహానా వశిస్త్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా పనిలో ఆమె సరైన పోషకాహారం తీసుకోకుండా ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటు రావడంతో గురువారం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం గెహానా పరిస్థితి క్లిష్టంగా ఉందని.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆమె ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని రక్షా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వర్గాల నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నం వెబ్ సిరీస్ కోసం మాద్ ద్వీపంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమె అపస్మారక స్థితిలో పడివుంది. దాంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
పల్స్ చాలా తక్కువగా వుండటంతోపాటు రక్తపోటు అధికంగా ఉందని వైద్యుడు మరియు రక్షా ఆసుపత్రి అధిపతి ప్రణవ్ కబ్రా తెలియజేశారు. ఆమె పల్స్ పునరుద్ధరించడానికి రెండు గంటలు పట్టిందని, ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉందని అతను వెల్లడించాడు. ఆమె శరీరం చికిత్సకు స్పందించడం లేదని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. అయితే ఆమె మెదడుకు సరైన ఆక్సిజన్ సరఫరా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆమెను వెంటిలేటర్‌లో ఉంచామని.. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని కబ్రా శుక్రవారం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com