చివరి గడియల్లో చిలిపి కోరిక.. మనవడితో కలిసి..

లైఫ్ హ్యాపీగానే సాగింది. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరికీ ఆస్తుల్ని, ఆప్యాయతల్ని పంచి ఇచ్చాడు. జీవితం సుఖంగా గడిచిపోయింది. అంతలోనే ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి బెడ్‌పై ఉండాల్సి వచ్చింది అమెరికా విస్కిన్‌సన్ సిటీకి చెందిన ఓ తాతగారు. అయనకున్న అనారోగ్య కారణాల రిత్యా ఎక్కువ రోజులు బతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేసారు. నామ మాత్రపు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కొడుకులను, మనవళ్లని దూరమవుతున్న క్షణాలు దగ్గరపడుతున్నాయని భావించిన తాతగారు ఓ మనవడిని పిలిచి మీ అందరితో కలిసి మందు కొట్టాలని ఉందని తన ఆఖరి కోరికను వెల్లడించారు. తాతగారి కోర్కెను తీర్చడానికి ఆ రాత్రి హాస్పిటల్ రూమ్‌ని బార్‌గా మార్చేశారు కుటుంబసభ్యులు. ఆయన సంతోషం కోసం అందరూ కలిసి ఓ పెగ్గేశారు. మర్నాటి ఉదయం తాత సంతోషంగా కన్నుమూశారు. అందరూ కలిసి బీరు తాగుతున్న ఫోటోను మనవడు ఆడమ్ స్కీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. చివరి గడియల్లో తాతగారి కోర్కెను తీర్చిన మనవడిని శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com