కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

X
By - TV5 Telugu |23 Nov 2019 9:02 AM IST
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద ట్రాక్టర్-టవేరా కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు. ట్రాక్టర్‌కు లైట్లు సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com