భార్య అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన ఎన్ఆర్ఐ

భార్య అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన ఎన్ఆర్ఐ

nri

భార్య అక్రమ సంబంధాన్ని ఓ ఎన్‌ఆర్‌ఐ భర్త గుట్టురట్టు చేశాడు. హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఉంటున్న ఓ డాక్టర్‌తో ఎన్‌ఆర్‌ఐ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో.. నిఘా పెట్టిన ఎన్‌ఆర్‌ఐ సంతోష్‌ రెడ్డి.. ఇద్దర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాడు.

సంతోష్‌ రెడ్డికి 2010లో సూర్యపేట జిల్లాకు చెందిన యువతితో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం చైతన్యపురిలోని వాసవి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సంతోష్‌ రెడ్డి ఉన్నత విద్య కోసం తరచూ ఆస్ట్రేలియా వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన భార్య.. డాక్టర్‌ శివ ప్రసాద్‌తో పరిచయం పెంచుకుంది.

భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సంతోష్‌ రెడ్డి పలు మార్లు హెచ్చరించాడు. వారి కుటుంబ సభ్యులకు చెప్పినా ఆమెలో మార్పు కనిపించలేదు. దీంతో ఆమెపై భర్త సంతోష్‌ రెడ్డి నిఘా పెట్టాడు. శుక్రవారం రాత్రి శివప్రసాద్‌, సంతోష్ రెడ్డి భార్య ఒకే దగ్గర ఉన్నారని సమాచారం అందడంతో.. పోలీస్‌కు ఫోన్‌ చేసి అక్కడికి రప్పించి.. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఎన్‌ఆర్‌ఐ భార్య-శివ ప్రసాద్‌లతో పాటు.. అదే సమయానికి నరేష్‌, విశాల అనే వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. వారి గుట్టు రట్టు చేసినందుకు తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎన్‌ఆర్‌ఐ. సంతోష్ రెడ్డి ఫిర్యాదుతో ఫ్లాట్‌లో ఉన్న శివప్రసాద్‌, విశాల, నరేష్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండకు తరలించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story