ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా

ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా

erraballi

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలయ్యాయి. జనగామ జిల్లా లింగాలపురం మండలం చిటూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కార్ డ్రైవర్ పార్థ సారధి, సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ మృతి చెందారు. అటెండర్ తాతారావు, గన్ మెన్ నరేష్, పిఎ శివకు గాయాలయ్యాయి.

మంత్రి దయాకర్‌రావు హైదరాబాద్‌ నుంచి పాలకుర్తికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెనుక వస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి దయాకర్‌రావు ఆస్పత్రికి చేరకుని క్షతగాత్రులను పరామర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story