దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే..

దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే..
X

kidnap

కాకినాడలో కలకలం రేపిన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియడం లేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందని బంధువులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే శాంతకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం దీప్తిశ్రీ కిడ్నాప్‌నకు గురైంది. తమ చిన్నారిని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అంటూ దీప్తిశ్రీ నాయయన్మ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ విద్యార్ధులు, వృద్ధాశ్రమంలో ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. ఆ తరువాత దీప్తిశ్రీని శాంతకుమారి తీసుకెళ్లినట్లు జగన్నాథపురం నేతాజీ మున్సిపల్‌ స్కూల్ విద్యార్ధులు గుర్తు పట్టారు. దీంతో సవతి తల్లే పాపని అపహరించిందని నిర్ధారించి పోలీసులు.. విచారించడంతో ఆమె నేరాన్ని ఆంగీకరించింది.. దీప్తిశ్రీని గొంతు నులిమి చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

దీప్తి శ్రీని హత్య చేసింది సవతి తల్లే అని తెలిసినా.. ఇప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు.ఆమె ఇచ్చిన సమాచారంతో ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Tags

Next Story