ప్రమాదానికి గురైన కారుకు వెయ్యి రూపాయల చలాన్

నిన్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి గురైన కారుకు వెయ్యి రూపాయల చలాన్ పడింది. ఆ దారిలో ఉన్న ఆటో మేటిక్ స్పీడ్ గన్ ద్వారా ఈ చలాన్ జనరేట్ అయ్యింది. కృష్ణ మిలన్‌రావు అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికే నిర్థారించిన పోలీసులు.. ఒకరు చనిపోయిన నేపథ్యంలో క్రిమినల్ కేసు కూడా పెట్టబోతున్నారు. ఈ యాక్సిడెంట్‌లో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కృష్ణ మిలన్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఇవాళ రేపట్లో పోలీసులు అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసి.. సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టబోతున్నారు.
ఈ ఫ్లైఓవర్‌పై స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లేనంటూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కృష్ణ మిలన్ ఈ ప్రమాదానికి కారణం అయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఇక్కడ 2 ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో.. డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయోమో పరిశీలించేందుకు నిపుణుల కమిటీ కూడా రంగంలోకి దిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com